ముందస్తు ఎన్నికల పై కేటిఆర్ సంచలన వాఖ్యలు

     Written by : smtv Desk | Thu, Nov 15, 2018, 02:52 PM

ముందస్తు ఎన్నికల పై కేటిఆర్ సంచలన వాఖ్యలు

హైదరాబాద్, నవంబర్ 15: తెలంగాణ మంత్రి కేటిఆర్ తాజాగా నగరంలోని సోమాజీగూడలో నిర్వహించిన 'మీట్ ది ప్రెస్ ఈవెంట్' లో పాల్గొని ముందస్తు ఎన్నికల పై సంచలన వాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో మీడియాతో మాట్లాడుతూ ''పేదరికం లేని నవ తెలంగాణా కోసం ముందుకేల్లాం, 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేవాళ్ళు పాలన చూసి అవాక్కయ్యారు అంటూ చెప్పుకొచ్చారు. వొ వైపు సంక్షేమ పతకాలు మరోవైపు ఆదాయ రెట్టింపు కోసం కృషి చేసాం, సంక్షేమానికి ఇది స్వర్ణ యుగమని చెప్పాలి. అలాగే రాష్ట్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చాం, 12 జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా చేసాం. తండాలు, గూడాలను గ్రామా పంచాయితీలుగా తీర్చిదిద్దాం అంటూ వెల్లడించారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికి, అలాగే చేనేత కార్మికులకు చేయూత నిచ్చేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. అంతేకాకుండా తాగునీటి సమస్య రావొద్దని మిషన్ భగీరథ తీసుకొచ్చాం దీని ద్వారా 46 వేల చెరువులను పునరుద్దరించాం. విద్యుత్ రంగంలో కూడా అనేక మార్పులు చేసి విధ్యత్ కోతలు లేకుండా రాష్ట్రం లో వెలుగులు నింపాం. 2004-14 వరకు ఇసుక ద్వారా ప్రతీ ఏటా 39.4 కోట్ల ఆదాయం వచ్చేది ఇప్పుడు ప్రతి ఏటా ఇసుక ద్వారా 50 0 కోట్లు వస్తుంది. అలాగే ఇవన్ని చెయ్యడానికి ముఖ్యమంత్రి బయటకు రానక్కర్లేదు రేషన్ కార్డులు ఇవ్వడం, నాళీలు శుబ్రం చెయ్యడం ఇవ్వి సీఎం పనులు కాదు. అంటూ హైదరాబాద్ ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దాలి.



16 రంగాల్లో దేశంలో అగ్ర భాగంలోనే వున్నాం. ఇవి కాక శాంతి బద్రతల విషయంలో రాజీ లేకుండా పని చేసాం. రాష్ట్రము లోని ఖాలీలన్ని నింపినా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు అని చెప్పాడు. విద్య వైద్య రంగాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇల్ల నిర్మాణంలో అవసరమైన మార్పులు చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు. అంతేకాక ఏపీ సీఎం పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు లాగ మేం గొప్పలు చెప్పుకోం బాబు వొంటరిగా ఎప్పుడూ పోటీ చేయలేదు ఆయన వైసిపీ తో తప్ప పొత్తు పెట్టుకొని పార్టీ లేదు'' అంటూ చెప్పుకొచ్చారు





Untitled Document
Advertisements