అయోమయం లో నందమూరి వారసురాలు

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 11:16 AM

అయోమయం లో నందమూరి వారసురాలు

హైదరాబాద్, నవంబర్ 17: తెలంగాణ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో తెదేపా నుండి నందమూరి సుహాషిని కూకట్ పల్లి నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సుహాషిని ని ఎన్నికల్లో దింపడానికి బాబు తీసుకున్న నిర్ణయం వెనుక పెద్ద కథే వుంది అని పలు వర్ఘాలు చెప్పుకుంటున్నాయి.

కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నాలుగు పార్టీలు ఏకమై మహా కూటమిగా ఏర్పడి ఎలాగైన తెలంగాణలో అధికారంలోకి రావాలని ముందుకు వెళ్తుండడం తెలిసిందే. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో టీడీపీని బతికించుకునేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ముఖ్యంగా శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో బలం చూపించుకునేందుకు పచ్చ అభ్యర్థులను బరిలోకి దించారు.

కూటమి తరపున టీడీపీ నుంచి కూకట్‌పల్లి నియోజకవర్గంలో దివంగత టీడీపీ ఎంపీ నందమూరి హరికృష్ణ కూమార్తె సుహాసిని నిలబెడుతున్నట్లు చంద్రబాబు శుక్రవారం ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం సుహాసిని కూడా మీడియాతో మాట్లాడారు. ‘చిన్నప్పటి నుంచి నాకు రాజకీయాలు అంటే ఇష్టం. తాత రామారావు, నాన్న హరికృష్ణ, మామయ్య చంద్రబాబుల స్పూర్తితో రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని అనిపించింది. అందుకే ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. రేపు నామినేషన్ వేస్తాను’ అని పేర్కొన్నారు.

సుహాసిని రాజకీయ ఎంట్రీపై ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఆమె నట సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌కు అసలే ఇష్టం లేదని చెబుతున్నారు.. దీంతో ఆమె పోటీ చేయాలా? వద్దా అనే డైలమాలో పడిందంట. అందుకే అన్ని సమాధానాలకు ఈ రోజు జవాబిస్తానని విలేకర్లు చెప్పిందని అంటున్నారు. హరికృష్ణను బాబు రాజకీయంగా కనుమరుగు చేయడం, అతని భౌతిక కాయాన్ని ఎన్టీఆర్ భవనానికి తీసుకెళ్లకుండా అడ్డుకోవడం వంటి వాటిని దృష్టిలో పెట్టుకుని పోటీ చేయొద్దని, మావయ్య ఉచ్చులో పడొద్దని బ్రదర్స్ అంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ బలంగా ఉందని, ఆ పార్టీతో తలపడితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయన్నది వారి భావన అని అంటున్నారు. హరికృష్ణ మరణం తర్వాత కేసీఆర్,కేటీఆర్ తమను ఓదార్చారని, ఇప్పుడు వారికి వ్యతిరేకంగా వెళ్లడం సరికాదని భావిస్తున్నట్లు సమాచారం. దీంతో జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు అక్కతరఫున ప్రచారం చేసే అవకాశం లేదని భావిస్తున్నారు.





Untitled Document
Advertisements