కాంగ్రెస్ కి రెబల్స్ షాక్

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 02:36 PM

కాంగ్రెస్ కి రెబల్స్ షాక్

హైదరాబాద్, నవంబర్ 17 : తెలంగాణలో రానున్నఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశించి నిరాశకు గురైన వారందరూ కలిసి రెబల్స్ ఫ్రంట్ పేరుతో చేతులు కలిపారు. 40 మంది ఈ లేబుల్‌తో బరిలోకి దూకుతున్నారు.

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు ఆశించిన భంగపడిన నేతలంతా కలిసి తెలంగాణ కాంగ్రెస్ రెబల్స్ ఫ్రంట్‌గా ఏర్పడ్డారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించుకుంటున్నామని మాజీ మంత్రి బోడ జనార్ధన్ శుక్రవారం ప్రకటించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్, భట్టి విక్రమార్క, కుంతియాలు సీట్ల పంపకాన్ని సిండికేట్ చేసి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు.

‘పాతోళ్లకే కాదు, కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారికీ సీట్లు అమ్ముకున్నారు. దీనికి ఆధారం నిన్న క్యామ మల్లేష్ బయటపెట్టిన ఆడియో టేపులే. సీట్ల పంపకాల్లో మాకు అన్యాయం జరిగింది నుక ఫ్రంట్‌గా ఏర్పడడం తప్పనిసరి అయింది. రెబల్ అభ్యర్థులం కామన్ సింబల్‌పై పోటీ చేస్తాం. ఈ నెల 19 లోపు నామినేషన్ వేస్తాం.. ’ అని వెల్లడించారు. ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనతోపాటు, మాజీమంత్రి విజయరామారావు, రవీందర్‌ తదితరులు మాట్లాడారు. రేపోమాపో చర్చించుకుని 40 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు.

రవీందర్ మాట్లాడుతూ. ‘ధర్మపురిలో నాలుగు సార్లు ఓడిన వారికి టికెట్‌ ఇచ్చారు. జనానికి ఐదోసారి కూడా సానుభూతి ఉంటుదా? వారు ఓట్లేస్తారా? ’ అని ప్రశ్నించారు.





Untitled Document
Advertisements