సిద్దిపేటలో హరీష్ రావు వ్యూహాలు

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 04:48 PM

సిద్దిపేటలో హరీష్ రావు వ్యూహాలు

సిద్ధిపేట, నవంబర్ 17: ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మల్లీ ఎలాగైనా తెరాస నే గెలిపించాలని లక్ష్యం తో పార్టీ నేతలు అనేక కార్యక్రమాలు చేపడుతూ వున్నారు. ఇక హరీష్ రావు విషయానికొస్తే తన సొంత గడ్డపై మల్లీ అధికారంలోకి రావాలని పకడ్బందీగా ప్రణాలికలను రూపొందిస్తున్నాడు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 94 వేలకుపైగా మెజారిటీతో గెలిచిన హరీశ్ ఈ సారి లక్షా 15 వేల మెజారిటీ లక్ష్యంగా సాగుతున్నారు.

ప్రతి ఓటరుకు చేరువ కావడానికి హరీశ్ ఇన్‌చార్జిలను రంగంలోకి దింపారు. సిద్దిపేటలో గత నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిపై విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. వొక్కో ఇన్‌చార్జికి వంద మంది ఓటర్ల వద్దకు వెళ్లి వారితో ముచ్చటిస్తున్నారు. హరీశ్ ఎమ్మెల్యేగా ఎలాంటి సేవలు చేశారు, ఆయన నుంచి ఇంకా మీరేం ఆశిస్తున్నారు? ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉన్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. హరీశ్ రావును మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. ఓటర్ల లిస్టుతోపాటు, హరీశ్ చేసిన అభివృద్ధికి సంబంధించిన పత్రాలను తమ వెంట తీసుకెళ్తూ ఓటర్లకు అందులోని వివరాలు చేరవేస్తున్నారు. ఇప్పటికే ఇన్‌చార్జిలు వేలమందిని కలిశారు. వొకసారి కలిసిన ఓటర్లు మళ్లీ మళ్లీ కలుస్తున్న సందర్భాలూ ఉన్నాయి. సిద్ధిపేటను హరీశ్ అభివృద్ధికి చిరునామాగా మార్చారని, ఆయనను ఎన్నుకోవాలనని కోరుతున్నారు. సిద్దిపేటలో 2 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. ప్రతి వందమందికి వొక ఇన్‌చార్జిని కలవాలంటే రెండు వేల మంది అవసరం. హరీశ్ కోసం ఇలాంటి ఇన్‌చార్జిలు నియోజకవర్గంలో కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ఇన్‌చార్జిలే కాకుండా హరీశ్‌పై అభిమానమున్న ప్రజలు కూడా ప్రచారం చేస్తున్నారు. ఉచిత కటింగ్ చేస్తానని వొకరి, అల్పాహారంపై రాయితీ ఇస్తున్నామని మరొకరు ప్రచారం చేస్తున్నారు.





Untitled Document
Advertisements