కాన్సర్ పై పుస్తకం రాసిన మనీషా

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 06:02 PM

కాన్సర్ పై పుస్తకం రాసిన మనీషా

ముంబై, నవంబర్ 17: సినీ రంగంలోని వారికి ఎక్కువ శాతం కాన్సర్ కు గురవుతారు అని పలు సందర్భాల్లో వైద్యులు చెప్పారు. ఎందుకంటే ఎక్కువసార్లు మేకప్ వేసుకోవడం, మద్యానికి, పొగతాగడానికి అధికంగా బానిసలు అవడమే అందుకు కారణం అంటారు. ఈ క్రమంలో ఇప్పటికి చాలా మంది సినిమావాళ్ళు కేన్సర్ బారిన పడి మృత్యువాత పడ్డారు. సీనియర్ నటి మనీషా కోయిరాల కూడా అండాశయ కేన్సర్ బారినపడి దాన్ని జయించింది. అమెరికాలో చికిత్స పొందారు. ఆ మహమ్మారి నుంచి మనీషా కోలుకుని ఆరేళ్ళు అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె కేన్సర్ తన జీవితంలో వొక భాగం ఎలా అయింది? తన జీవితాన్ని ఎలా మార్చేసిందో.. ఈ క్రమంలో తను అనుభవించిన మానసిక సంఘర్షణ, తనకుతాను చెప్పుకున్న ధైర్యం, మృత్యువును చిరునవ్వుతో ఓడించిన విధానాన్ని.., వివరిస్తూ ఓ పుస్తకం రాశారు. ఈ పుస్తకానికి ‘హీల్డ హవ్ కేన్సర్ గేవ్ మీ ఎ న్యూ లైఫ్’(HEALED How cancer gave me a new life) అని పేరు పెట్టారు. ఈ పుస్తకాన్ని మనీషా ఇటీవల ముంబైలో విడుదల చేశారు. దీనిని మనీషా ప్రముఖ రచయిత్రి నీలమ్ కుమార్ సహాయంతో రాశారు. కవర్ మీద మనీషా నవ్వుతున్న ముఖచిత్రం ముద్రించారు. దేన్నైనా నవ్వుతూ, ధైర్యంగా ఎదురించాలని చెప్పకనే చెప్పారు ముఖచిత్రం ద్వారా. ‘కేన్సర్‌తో పోరాటం తన జీవితానికి ఓ గుణపాఠం లాంటిది.. ఈ జబ్బు తనకు అనేక కొత్త పాఠాలు నేర్పింది’అని తన ట్విటర్‌లో వివరించారు.

‘1942 ఏ లవ్ స్టోరీ’ సినిమా ద్వారా సినిమా రంగంలో అడుగుపెట్టారు ఈ నేపాలి ముద్దుగుమ్మ. ఆ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘బాంబే’ సినిమాతో తిరగులేని నటిగా తన ముద్ర వేశారు. తెలుగు, తమిళం, హీందీ భాషల్లో నటించి మెప్పించారు. పెళ్లి చేసుకుని సినిమాలకు కొంతకాలం దూరమైంది. ఇంతలో తనకు కేన్సర్ సోకింది. దాన్ని ధైర్యంగా అధిగమించారు మనీషా.

మనీషా కొయిరాలా ఈ మధ్యే రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో ‘సంజూ’ చిత్రంలో నటుడు సంజయ్ దత్‌ తల్లి నర్గీస్ దత్ పాత్ర పోషించారు.





Untitled Document
Advertisements