ఎస్‌బీఐ సంచలన నిర్ణయం

     Written by : smtv Desk | Sun, Nov 18, 2018, 04:30 PM

ఎస్‌బీఐ సంచలన నిర్ణయం

న్యూ ఢిల్లీ, నవంబర్ 18: 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ బ్యాంక్ ఖాతాదారులు ఈ నెల 30 వ తేదీలోగా తమ తమ ఖాతాలకు వారి ఫోన్ నంబర్లు ఖచ్చితంగా లింక్ చేసుకోవాలని స్పష్టం చేసింది. లింక్ చేసుకొని వారి ఖాతాదారుల అకౌంట్ లను డిసెంబర్ 1 నుండి వారికి ఎటువంటి ఆన్ లైన్ సేవలను ఉపయోగించుకోలేరని వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు బ్యాంక్ ప్రకటించింది. ఇప్పటి వరకు మొబైల్ నెంబర్‌ను అనుసంధానం చేసుకోని వాళ్లు సంబంధిత బ్యాంక్ శాఖలో కానీ.. లేదా ఏటీఏంలో గానీ లింక్ చేసుకోవచ్చని బ్యాంక్ తెలిపింది.

Untitled Document
Advertisements