కాంగ్రెస్ తుది జాబితా

     Written by : smtv Desk | Mon, Nov 19, 2018, 11:12 AM

కాంగ్రెస్ తుది జాబితా

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మూడు జాబితాల ద్వారా 88 మంది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్.. ఆదివారం రాత్రి తుది జాబితాను వెల్లడించింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 94, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో ఎల్బీ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ఆర్‌.కృష్ణయ్యకు పేరు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసంది.

తుది జాబితా అభ్యర్థులు..

1. కోరుట్ల – జువ్వాడి నరసింగ‌రావు
2.నారాయణ్‌ఖేడ్‌ – సురేష్‌కుమార్‌ షెట్కార్
3. సికింద్రాబాద్‌- కాసాని జ్ఞానేశ్వర్‌
4. నారాయణపేట్‌- వేమనగిరి కృష్ణ
5. దేవరకద్ర – పవన్‌కుమార్‌రెడ్డి
6. మిర్యాలగూడ – ఆర్‌.కృష్ణయ్య





Untitled Document
Advertisements