కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి అన్యాయం చేస్తుందా...?

     Written by : smtv Desk | Mon, Nov 19, 2018, 01:30 PM

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి అన్యాయం చేస్తుందా...?

హైదరాబాద్, నవంబర్ 19: మహాకూటమిలో భాగమైన పార్టీ నుండి టికెట్ ఆశించిన వారికి పార్టీ నిరాశ మిగిల్చే సరికి ఆ నేతలు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి. నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర వుంది ఆయనకు. అయినా కంగ్రెస్ అధిష్ఠానం ఆయనను పక్కకు పెట్టింది. 2009 సాధారణ ఎన్నికల సమయంలో కూడా మత్యంరెడ్డికి కాంగ్రెస్ హ్యాండే ఇచ్చింది. అప్పట్లో టీఆర్‌ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడ్డాయి. ఆ సమయంలో దుబ్బాక స్థానం కూటమి నుంచి టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న సోలిపేట రామలింగారెడ్డికి దక్కింది. ఇప్పుడు కూడా మహాకూటమి స్థానాల్లో భాగంగా దుబ్బాక టికెట్‌ను టీజేఎస్‌కు కేటాయించింది. దీంతో ఆయన మరోమారు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏనాడు తాను ప్రజాభిప్రాయలకు వ్యతిరేకంగా పనిచేయలేదని కన్నీరు మున్నీరయ్యారు. డబ్బులు లేవనే తనకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వలేదని ఆయన కంటతడి పెట్టుకున్నారు. ముత్యం రెడ్డిని కలిసిన మంత్రి హరీష్ రావు… ఆయనను ఓదార్చారు. టీఆర్ఎస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. టీఆర్ఎస్‌లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ కూడా అందించారు.

అందుకు ఆయన అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈనెల 20న కేసీఆర్‌ సమక్షంలో ముత్యంరెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. మూడేళ్ల క్రితం అనారోగ్యంతో ఉన్న ముత్యంరెడ్డిని ఆదుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాజకీయంగా శత్రుత్వం ఉన్నా చికిత్స కోసం సాయం చేశారు.





Untitled Document
Advertisements