సెన్సెక్స్ 317 పాయింట్ల లాభం

     Written by : smtv Desk | Mon, Nov 19, 2018, 06:28 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అమెరికా, యూరోపియన్‌ మార్కెట్ల పాజిటివ్‌ ధోరణితో కీలక సూచీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంనుంచి పాజిటివ్‌గా ఉన్న మార్కెట్లలో మిడ్‌ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు మరింత పెరగడంతో సెన్సెక్స్‌ 318 పాయింట్లు జంప్‌చేసి 35,775 వద్ద ముగిసింది.నేడు ఆర్బీఐ బోర్డు పలు విషయాలపై చర్చించడానికి ప్రభుత్వంతో సమావేశమైన నేపథ్యంలో మార్కెట్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. నిఫ్టీ సైతం 81 పాయింట్ల లాభంతో 10,763 వద్ద స్థిరపడింది. పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్వల్పంగా నష్టపోగా, రియల్టీ, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, ఆటో, ఫార్మా, ఐటీ లాభపడ్డాయి.

ఈ క్రమంలో టాటామోటార్స్, సన్ ఫార్మా, ఎస్ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ తదితర షేర్లు లాభాలు పండించుకున్నాయి. ఇక బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియా బుల్స్, ఓఎన్జీసీ, గెయిల్ తదితర కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి.





Untitled Document
Advertisements