కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు

     Written by : smtv Desk | Mon, Nov 19, 2018, 07:12 PM

కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. మాజీ మంత్రి డీకే అరుణ, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మధ్య విభేదాలు, కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయి. నారాయణ పేట నుంచి శివకుమార్ కు టికెట్ ఇప్పించేందుకు డీకే అరుణ తీవ్రంగా ప్రయత్నించగా ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. నారాయణ పేట నుంచి వామనగారి కృష్ణ కు జైపాల్ రెడ్డి టికెట్ ఇప్పించారు. దీంతో నారాయణ పేటలో డీకే అరుణ అనుచరులు ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలను ధ్వంసం చేసి.. జైపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Untitled Document
Advertisements