పత్రికా ప్రకటన విడుదల చేసిన ఏపి ఆర్ధికమంత్రి

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 12:21 PM

పత్రికా ప్రకటన విడుదల చేసిన ఏపి ఆర్ధికమంత్రి

న్యూ ఢిల్లీ, నవంబర్ 20: సోమవారం ఏపి ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీపై వొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. “రాష్ట్రాలకు సార్వభౌమాధికారం లేదని కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ అనడం సబబుకాదు. రాజ్యాంగంలో కేంద్ర విధులు,రాష్ట్ర విధులపై స్పష్టత ఉంది. అన్నీ తెలిసి కూడా తెలియనట్లు అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు ఉన్నాయి.

రాజ్యాంగపరంగా రాష్ట్రాలకు సార్వభౌమాధికారాలు లేవనడం హాస్యాస్పదం. అరుణ్ జైట్లీ వ్యాఖ్యలు సమాఖ్య స్ఫూర్తికే తూట్లు. నరేంద్రమోది మాటలనే అరుణ్ జైట్లీ వల్లెవేశారు. రాఫెల్ పై కాగ్ నివేదికను పార్లమెంట్ లో ఎందుకు పెట్టలేదో జాతికి అరుణ్ జైట్లీ జవాబివ్వాలి.సుప్రీంకోర్ట్ వద్దకూడా రహస్యాలు ఎందుకు దాస్తున్నారు? కాగ్ నివేదికలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోళ్ల కుంభకోణంపై చేసిన వ్యాఖ్యలు ఏమిటి? రాఫెల్ పై కాగ్ నివేదికను బైటపెట్టే ధైర్యం కేంద్రంలో బిజెపి నేతలకు ఉందా? అధికారుల పరస్పర కేసులతో సిబిఐ అప్రదిష్ట పాలు. ఈ నేపథ్యంలో సిబిఐకి సమ్మతి ఉపసంహరణ 100% సరైన చర్య. ఐఆర్ సిటిసి లో లాలూ ప్రసాద్ ను కావాలనే ఇరికించారు.అస్థానా, నరేంద్రమోది కుమ్మక్కై లాలూని ఇరికించారు. రాజకీయ వేధింపులతోనే లాలూపై కేసులు పెట్టారు..? సివిసికి అలోక్ వర్మ వాంగ్మూలం కన్నా ఆధారాలు ఏం కావాలి?

ఢిల్లీలో కాలుష్యాన్ని మించిపోయింది నరేంద్రమోది రాజకీయ కాలుష్యం. మోది కాలుష్యాన్ని కడిగేందుకే బిజెపియేతర పార్టీలన్నీ ఏకం అయ్యాయి. ఓట్ల కోసమే చాయ్ వాలా అని మోది చెప్పుకున్నారు. మోది పేరుకే చాయ్ వాలా, కానీ ఆచరణలో కార్పోరేట్ వాలా. నరేంద్ర మోది ధనవంతులకే కొమ్ము కాస్తున్నారు.సెక్యులరిజానికి నరేంద్రమోది వ్యతిరేకం. సోషలిజానికి నరేంద్రమోది వ్యతిరేకం.ఫాసిస్ట్ ధోరణితో నరేంద్రమోది వ్యవహరిస్తున్నారు. అందుకే ప్రజాస్వామ్య వాదులంతా ఏకం అవుతున్నారు. బిజేపియేతర శక్తులన్నీ ఏకం అవుతున్నారు. దేశాన్ని కాపాడటంలో అందరూ ముందుకురావాలి. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి” అని యనమల అన్నారు.

Untitled Document
Advertisements