ఏపీ పోలీసుల తీరుపై మండిపడుతున్న రైతులు

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 02:13 PM

ఏపీ పోలీసుల తీరుపై మండిపడుతున్న రైతులు

అమరావతి, నవంబర్ 20: ఏపీ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమ‌రావ‌తి రాజధాని పంటపొలాలను తగలబెట్టిన కేసును పోలీసులు సోమవారం మూసేశారు. గుర్తు తెలియని దుండగులు 2014 డిసెంబర్‌ 29 రాత్రి తుళ్లురు, తాడేపల్లి మండలాల్లోని 13 చోట్ల పంట పొలాలను తగలబెట్టారు. ఆ సమయంలో పొలాల్లో మంటలు ఆరకముందే ఇది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టే చేసిన పనేనంటూ అధికార పార్టీ నేతలు విష ప్రచారం చేశారు. ఈ కేసుతో రాజధానికి భూములు ఇవ్వని రైతులను టార్గెట్‌ చేసి పోలీసులతో వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేని రైతులు రాజధానికి పొలాలు ఇచ్చేశారు.

నాలుగేళ్లుగా విచారించిన పోలీసులు తీరా ఇప్పుడు నిందితులను కనిపెట్టలేకపోయామంటూ కేసును క్లోజ్‌ చేశారు. ఈ కేసు మూసివేయడంపై అభ్యంతరాలుంటే వారం రోజుల్లోపు కోర్టుకు చెప్పుకోవచ్చని రైతులకు నోటీసులిచ్చారు. మరోవైపు ఇలా కేసు మూసేయడంపై రైతులు మండిపడుతున్నారు. విచారణ పేరుతో తమను చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. నిందితులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements