రాకేశ్ ఆస్థాన కేసుపై కీలక ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి

     Written by : smtv Desk | Tue, Nov 20, 2018, 02:21 PM

రాకేశ్ ఆస్థాన కేసుపై కీలక ఆరోపణలు చేసిన ఐపీఎస్ అధికారి

న్యూ ఢిల్లీ, నవంబర్ 20: ఐపీఎస్ అధికారి మనీశ్ కుమార్ సిన్హ సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాపై అవినీతి ఆరోపణల కేసు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ కేసుకు సంభందించిన పలు కీలక ఆరోపణలు చేశారు ఐపీఎస్ అధికారి. కేంద్ర మంత్రి హరిభాయ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబల్‌, సీవీసీ కేవీ చౌదరి రాకేశ్ కేసు విచారణను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగానే తనను బదిలీ చేశారన్నారు తనను మహరాష్ట్రలోని నాగ్‌పూర్‌కు బదిలీ చేయడాన్ని రద్దు చేయాలంటూ సిన్హా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో తన పిటిషన్‌పై అత్యవసర విచారణ జరపాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.

ఈ పిటిషన్ పై స్పందించిన సుప్రీం అత్యవసరంగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి ప్రశ్నించారు.. దీనికి సమాధానంగా తన వద్ద రాకేశ్‌ అస్థానా గురించి సంచలన పత్రాలు ఉన్నాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌ ఆలోక్‌ వర్మను తప్పించి సెలవుపై పంపడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం నవంబర్ 20 విచారణ జరపనున్న నేపథ్యంలో .. తన పిటిషన్‌పైనా అప్పుడే విచారణ జరిపించాలని సిన్హా కోరడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు పనితీరు మసకబారుతోందని వస్తున్న విమర్శలకు కీలక స్థాయిలో ఉన్న అధికారులు చేస్తున్న ఆరోపణలు సైతం బాలన్ని చేకూర్చుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.





Untitled Document
Advertisements