విగ్రహానికి 3వేల కోట్లు...రాజధానికి రూ.1500 కోట్లా ..?

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 11:43 AM

విగ్రహానికి 3వేల కోట్లు...రాజధానికి రూ.1500 కోట్లా ..?

అమరావతి, నవంబర్ 21: ఆంద్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ బిజేపి పై సంచలన వాఖ్యాలు చేశారు. ఏపీ లో బీజేపీ వొక్క కార్పొరేటర్‌ స్థానం కూడా గెలిచే పరిస్థితి లేదని హేళన చేశాడు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ "రాష్ట్ర అభివృద్ధి కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, నాలుగేళ్లైనా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు. హోదా ఇవ్వకుండా ఏపీకి బీజేపీ వెన్నుపోటు పొడిచిందని" లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే "పటేల్ విగ్రహానికి 3వేల కోట్లు ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధానికి రూ.1500 కోట్లే ఇచ్చిందన్నారు. ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌కి తితలీ బాధితులను పలకరించే సమయం లేదా అని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి సాయం చేసే మనసు కేంద్రానికి లేదని" లోకేష్ విమర్శించారు.

Untitled Document
Advertisements