పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 03:51 PM

 పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం

చెన్నై,నవంబర్ 21: తమిళనాడు చెన్నై చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎయిర్‌పోర్టకు చేరుకున్న పవన్ కళ్యాణ్ కు జనసైనికులు, ఐటీ ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. దీంతో చెన్నై ఎయిర్ పోర్టులో సందడి వాతావరణం చోటు చేసుకుంది.జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి, ఆహ్వానం పలికారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.ఈరోజు ఆయన కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పవన్ చెన్నై పర్యటన నేపథ్యలో, సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఏపీతో పాటు తమిళనాడు, కర్ణాటక రాజకీయాల్లోనూ పవన్ క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అక్కడ తన మద్దతుదారులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements