బాలయ్య ఇంటిముందు కార్మికుల ఆందోళన

     Written by : smtv Desk | Wed, Nov 21, 2018, 05:09 PM

బాలయ్య ఇంటిముందు కార్మికుల ఆందోళన

హిందూపురం, నవంబర్ 21: ప్రముఖ సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందు పారశుద్ధ్య కార్మికులు జీవో 279ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇంటిని చుట్టుముట్టారు. 220 మంది మున్సిల్ కార్మికులు హిందూపురంలోని ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. పారిశుద్ధ్య కార్మికులను విధుల నుంచి తొలగించడంతో వారు భగ్గుమన్నారు.

ఈ క్రమంలో బాలకృష్ణ ఇంటి వద్ద పెద్ద ఎత్తున చెత్త వేసి వారు తమ నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వచ్చారు. వారిని ఈడ్చుతుండగా అక్కడ తోపులాట చోటు చేసుకుంది. ఈ తోపులాటలో పలువురు కార్మికులు గాయపడ్డారు. మున్సిపల్‌ కార్మికుల ఆందోళనలో పాల్గొన్న సీఐటీయూ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Untitled Document
Advertisements