సిట్ నోటీసులకు బదులిచ్చిన జగన్

     Written by : smtv Desk | Thu, Nov 22, 2018, 12:02 PM

సిట్ నోటీసులకు బదులిచ్చిన జగన్

అమరావతి, నవంబర్ 22: విశాఖ విమానాశ్రయంలో జగన్ దాడి పై విచారణ చేపట్టిన సిట్ కు జగన్ సమాధానమిచ్చారు. హైకోర్టులో తాము వేసిన రిట్ పిటిషన్ పై నిర్ణయం వచ్చేంత వరకు వాంగ్మూలం ఇవ్వనని సిట్ అధికారులకు తెలిపారు. ఏపీ పోలీసుల విచారణపై తనకు నమ్మకం లేదని, ఏదైనా దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే దీనీపై ఈనెల 27న విచారణ జరగనుంది. దీంతో ముందు కోర్టులో విషయం తేలిన తర్వాతే కోడికత్తి కేసులో వాంగ్మూలం ఇస్తానని ఆయన సిట్ నోటీసులకు బదులిచ్చారు.

Untitled Document
Advertisements