పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 04:06 PM

పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక

అనంతపురం, నవంబర్ 23: జనవరిలో కియా కారు రాబోతుందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన ఈరోజు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. కప్పలబండ గ్రామదర్శనిలో పాల్గొని ప్రసంగించారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 36 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. పెళ్లి రోజునే చంద్రన్న పెళ్లి కానుక అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. 16 లక్షల కోట్ల పెట్టుబడితో 30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సీఎం యువనేస్తం కింద నిరుద్యోగులకు వెయ్యి రూపాయల భృతి ఇస్తున్నట్లు చెప్పారు. నదుల అనుసంధానం ద్వారా జిల్లాలోని అన్ని చెరువులకు నీరిస్తున్నామని, మైక్రో ఇరిగేషన్‌తో నీటి పొదుపు సాధ్యమని చంద్రబాబు తెలిపారు





Untitled Document
Advertisements