తెలంగాణ రాష్ట్రం ‘ఆర్ధిక వ్యవస్థ’, ‘అభివృద్ధి’ రంగాలలో నెంబర్-1

     Written by : smtv Desk | Fri, Nov 23, 2018, 06:56 PM

తెలంగాణ రాష్ట్రం ‘ఆర్ధిక వ్యవస్థ’, ‘అభివృద్ధి’ రంగాలలో నెంబర్-1

హైదరాబాద్, నవంబర్ 23: ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఏటా వివిద రాష్ట్రాలకు వివిద రంగాలలో చూపిన ప్రగతికి గుర్తింపుగా అవార్డులు ఇస్తుంటుంది. పెద్ద రాష్ట్రాల విభాగంలో 2017సం.లో ఇండియా టుడే ప్రకటించిన 'బెస్ట్ స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' అవార్డులలో తెలంగాణ రాష్ట్రం ‘ఆర్ధిక వ్యవస్థ’, ‘అభివృద్ధి’ రంగాలలో నెంబర్-1 స్థానంలో నిలిచి అవార్డు స్వంతం చేసుకొంది.

గురువారం డిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్ లో జరిగిన ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా తెలంగాణ రాష్ట్రం తరపున తెలంగాణభవన్‌ ప్రిన్సిపాల్ రెసిడెంట్ కమీషనర్ అశోక్ కుమార్ ఈ అవార్డులను అందుకొన్నారు.

పెద్ద రాష్ట్రాల విభాగంలో మొత్తం 21 రాష్ట్రాలను తీసుకొని ఇండియా టుడే ఈ ర్యాంకింగ్స్ ప్రకటించింది. ఆ 21 రాష్ట్రాలలో వివిద రంగాలలో మొదటి 5 ర్యాంకులలో నిలిచిన రాష్ట్రాలు, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు లభించిన ర్యాంకింగ్స్, అట్టడుగు స్థానంలో నిలిచిన రాష్ట్రాల వివరాలు ఈవిధంగా ఉన్నాయి:

ఆర్ధికవ్యవస్థ: ర్యాంక్స్: తెలంగాణ-1, హర్యాన-2 గుజరాత్-3, ఉత్తరాఖండ్-4, హిమాచల్ ప్రదేశ్-5, మహారాష్ట్ర-9, ఆంధ్రప్రదేశ్-14, బీహార్-21.

అభివృద్ధి: తెలంగాణ-1, కర్నాటక-2, పంజాబ్-3, ఆంధ్రప్రదేశ్-4, ఉత్తరాఖండ్-5, బీహార్-19, అస్సోం-21. మౌలికవసతులు: హిమాచల్ ప్రదేశ్-1, గుజరాత్-2, ఆంధ్రప్రదేశ్-3, తమిళనాడు-4, మహారాష్ట్ర-5, తెలంగాణ-11, బీహార్-21.

వ్యవసాయం: ఆంధ్రప్రదేశ్-1, మధ్యప్రదేశ్-2, ఛత్తీస్ ఘడ్-3, కర్ణాటక-4, ఒడిశా-5, తెలంగాణ-7, బీహార్-21.

పర్యావరణం: కేరళ-1, హిమాచల్ ప్రదేశ్-2, కర్నాటక-3, ఆంధ్రప్రదేశ్-4, తెలంగాణ-5, ఉత్తరప్రదేశ్-21.

పరిపాలన: కేరళ-1, ఛత్తీస్ ఘడ్-2, మధ్యప్రదేశ్-3, ఆంధ్రప్రదేశ్-4, హిమాచల్ ప్రదేశ్-5, తెలంగాణ-10, జమ్మూకశ్మీర్‌-21.

శాంతి భద్రతలు: నెంబర్:1 ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. తమిళనాడు-2, జమ్మూకశ్మీర్‌, కేరళ-3,ఉత్తరాఖండ్-4, గుజరాత్-5, ఆంధ్రప్రదేశ్-9, తెలంగాణ-15, బీహార్-20, అస్సోం-21.

ఎంట్రప్రెన్యువర్షిప్ (వ్యవస్థాపకత): కర్ణాటక-1, గుజరాత్-2,మహారాష్ట్ర-3, మధ్యప్రదేశ్-4, ఉత్తరాఖండ్-5, తెలంగాణ-11, ఆంధ్రప్రదేశ్-15, జమ్మూకశ్మీర్‌-21.

విద్యారంగం: హిమాచల్ ప్రదేశ్-1, ఉత్తరాఖండ్-2, హర్యానా-3, రాజస్థాన్-4, పశ్చిమ బెంగాల్-5, తెలంగాణ-14, ఆంధ్ర ప్రదేశ్-21, బీహార్-21.

ఆరోగ్యం: హిమాచల్ ప్రదేశ్-1, గుజరాత్-2, కర్ణాటక-3, మహారాష్ట్ర-4, జమ్మూకశ్మీర్‌-5, తెలంగాణ-12, ఆంధ్రప్రదేశ్-15, బీహార్-21.

పరిశుభ్రత: కేరళ-1, పంజాబ్-2, హర్యానా-3, తమిళనాడు-4, ఉత్తరాఖండ్-5, తెలంగాణ-11, ఆంధ్రప్రదేశ్-10, ఒడిశా-20.

పర్యాటకం: గుజరాత్-1, హిమాచల్ ప్రదేశ్-2,కర్ణాటక-3, అస్సోం-4, హర్యానా-5, తెలంగాణ-8, ఆంధ్రప్రదేశ్-19, ఝార్ఖండ్-21.





Untitled Document
Advertisements