టీ20 వరల్డ్ కప్‌గా

     Written by : smtv Desk | Sat, Nov 24, 2018, 03:55 PM

 టీ20 వరల్డ్ కప్‌గా

దుబాయ్ ,నవంబర్ 24: వరల్డ్ టీ20 పేరును టీ20 వరల్డ్ కప్‌గా మార్చినట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) లేటెస్ట్ గా ప్రకటించింది. 2019 ఆరంభంలో ఆవిష్కరించనున్న గ్లోబల్ క్రికెట్ స్ట్రాటజీలో భాగంగా పేరును మార్చినట్లు ఐసీసీ తెలిపింది. టీ20 ప్రపంచ చాంపియన్‌షిప్ నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. ఆస్ట్రేలియాలో 2020లో జ‌ర‌గ‌నున్న టోర్న‌మెంట్లో ఐసీసీ ఉమెన్స్‌ టీ20 వరల్డ్ కప్, ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్ కప్‌గా పిలుస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది . పేరు మార్పును పురుషుల, మహిళల జట్ల కెప్టెన్లు స్వాగతించారు.





Untitled Document
Advertisements