యడ్యూరప్ప తరహాలో సీఎం కావాలని పవన్‌ కలలు

     Written by : smtv Desk | Sat, Nov 24, 2018, 04:10 PM

యడ్యూరప్ప తరహాలో సీఎం కావాలని పవన్‌ కలలు

అమరావతి ,నవంబర్ 24: ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఈరోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై సంచలన వాక్యాలు చేసారు , పవన్ కళ్యాణ్ తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే మంచిదని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై పవన్‌ వ్యాఖ్యలు సరికాదన్నారు. చంద్రబాబు ఈ వయసులోనూ కష్టపడి పనిచేస్తున్నారన్నారు. యడ్యూరప్ప తరహాలో సీఎం కావాలని పవన్‌ కలలు కంటున్నారని, మోదీ డైరెక్షన్‌లో పవన్‌, జగన్‌ నడుస్తున్నారని వెంకన్న అన్నారు. జగన్‌కు దమ్ముంటే తన ఆస్తులను ప్రకటించాలని, చంద్రబాబు, లోకేష్‌ గురించి మాట్లాడే అర్హత జగన్‌కు లేదని వెంకన్న అన్నారు.

Untitled Document
Advertisements