విజయ్ దేవరకొండ మంచి ప్రతిభ ఉన్న నటుడు: జాన్వీ

     Written by : smtv Desk | Mon, Nov 26, 2018, 07:43 PM

విజయ్ దేవరకొండ మంచి ప్రతిభ ఉన్న నటుడు: జాన్వీ

హైదరాబాద్ , నవంబర్ 26: టాలీవుడ్ యంగ్ స్టార్ విజయ్ దేవరకొండ ఇప్పుడు యూత్‌కు ఫేవరేట్ స్టార్ అయ్యాడు. అతనికి యువతలో మంచి క్రేజ్ వుంది. అంతే సమానంగా అమ్మాయిల్లోనూ విజయ్‌కి మంచి ఫాలోయింగ్ వుంది. తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో విజయ్‌కి ఫ్యాన్స్ వున్నారు. కానీ ఓ బాలీవుడ్ హీరోయిన్‌కి కూడా విజయ్ ఫేవరేట్ హీరో అయ్యాడు. అత్యంత సెక్సీ వ్యక్తి అని, కలుసుకోవాలనిపించే వ్యక్తి అని కితాబిచ్చింది ఆ భామ. తెలుగు హీరోలు బాలీవుడ్ భామలకు తెలియడం అనేది చాలా అరుదైన విషయం. ఇంతకీ ఆ భామ ఎవరో కాదు… శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్.

టీవీ షోలలో అత్యంత పాపులర్ అయిన ‘కాఫీ విత్ కరణ్’ షోలో జాన్వీ తన మనసులోని మాటను చెప్పింది. ఈ షో వ్యాఖ్యాత కరణ్ జోహార్ ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నల్లో భాగంగా ‘నీకు అవకాశం వస్తే ఏ ఆకర్షవంతమైన వ్యక్తిని ఎంపిక చేసుకుంటావు?’ అని అడిగాడు. అంతే జాన్వీ ఠక్కున విజయ్ దేవరకొండ పేరు చెప్పేసింది. అతడిలో సెక్స్ అప్పీల్ తనకు నచ్చుతుందని, అతను మంచి ప్రతిభ ఉన్న నటుడు కూడా అని అతని నటనను కొనియాడింది జాన్వీ. ఆమె సమాధానానికి కరణ్ ఒక్కసారిగా షాకయ్యాడు.

కొన్నాళ్ళుగా విజయ్, జాన్వీ కాంబినేషన్‌లో సినిమా వస్తుందనే వార్తలు వచ్చాయి. కాగా, జాన్వీ కామెంట్‌తో వారిద్దరి కలయికలో సినిమా రావడం ఖాయమైనట్టే అనిపిస్తోంది.

Untitled Document
Advertisements