ఎన్టీఆర్ బయోపిక్ లో మరో భామ

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 12:15 PM

ఎన్టీఆర్ బయోపిక్ లో మరో భామ

హైదరాబాద్, నవంబర్ 27: ‘ఎన్టీఆర్’ బయోపిక్ షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నది. రెండు పార్టులుగా రిలీజ్ చేయబోతున్న ఈ సినిమాలో మొదటి భాగం ఎన్టీఆర్ సినిమాల గురించి ఉంటుంది. ఎన్టీఆర్ చేసిన సినిమాలు, అందులోని ముఖ్యమైన సన్నివేశాలు, సాంగ్స్ తో ఈ సినిమా ఉండబోతున్నది. ఎన్టీఆర్ తో కలిసి పనిచేసిన నటీనటులకు సంబంధించిన పాత్రల్లో కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లు నటిస్తున్నారు.

విద్యాబాలన్, శ్రేయ శరన్, తమన్నా, రకుల్ ప్రీత్ సింగ్, మాళవిక నాయర్, రాశి ఖన్నా, కళ్యాణ్ రామ్, సుమంత్ తదితర నటీనటులు నటిస్తున్నారు. తాజాగా జయసుధ పాత్రలో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చేస్తున్న సంగతి తెలిసిందే. జయప్రద పాత్ర కోసం హన్సికను ఎంపిక చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ దేశముదురు సినిమాతో హన్సిక వెండితెరకు పరిచయం అయింది. అనతికాలంలోనే అనేకమంది స్టార్ హీరోల సినిమాల్లో నటించింది హన్సిక.

Untitled Document
Advertisements