మరో కొత్త హీరోయిన్ ని పరిచయం చేయబోతున్న శేఖర్ కమ్ముల

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 03:51 PM

మరో కొత్త హీరోయిన్ ని పరిచయం చేయబోతున్న  శేఖర్ కమ్ముల

నిజామాబాద్‌ , నవంబర్ 27: టాలీవుడ్ టాలెంటెడ్ ఫిలింమేకర్ శేఖర్ కమ్ముల.. వీలైనంత వరకు కొత్త నటీ నటులతో పనిచేయాలని తపనపడే దర్శకుడు. ఆయన పరిచయం చేసిన చాలా మంది హీరోయిన్లు తెలుగునాట ఒక వెలుగు వెలిగారు. ప్రస్తుతం చేస్తున్న కొత్త సినిమా ద్వారా కూడ ఒక కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నాడు కమ్ముల. అదీ తెలుగమ్మాయి కావడం విశేషం.

ఈ తెలుగమ్మాయిది విజయవాడట. స్వతహాగా మంచి క్లాసికల్ డాన్సర్ కావడం వలన ఆమెకు ఈ ఆఫర్ ఇచ్చాడట కమ్ముల. అంతేకాదు ఈ సినిమాలో హీరో కూడ కొత్తవాడేనట. ఈ ఇద్దరు కొత్తవాళ్ళని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 2వ వారం నుండి ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది.

Untitled Document
Advertisements