లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 06:11 PM

లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్, నవంబర్ 27: ఈరోజు ఉదయం మందకొడిగా ఉన్నా స్టాక్‌ మార్కెట్లు మధ్యాహ్నం నుండి పుంజుకొంది, మార్కెట్‌ ముగిసే సమాయానికి సెన్సెక్స్‌ 159 పాయింట్లు లాభపడి 35,513 వద్ద,57 పాయింట్లు లాభపడిన నిప్టీ 10,685 వద్ద ముగిశాయి. నేటి ట్రేడింగ్‌లో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, బీపీసీఎల్‌ షేర్లు లాభపడగా.. సన్‌ఫార్మా, హీరో మోటోకార్ప్‌ షేర్లు నష్టపోయాయి. నేటి మార్కెట్లో ప్రభుత్వ బ్యాంకుల, విద్యుత్తు, ఐటీ కంపెనీలు ప్రధానంగా లాభపడ్డాయి. ఫార్మా, ఆటోమొబైల్‌, టెలికాం షేర్లు కొంత ఒత్తిడికి లోనయ్యాయి. చమురు ధరలు తగ్గటం కూడా మార్కెట్లకు ఒకింత కలిసి వచ్చింది.

Untitled Document
Advertisements