కొలిక్కి రాని మహేష్ సుకుమార్ సినిమా

     Written by : smtv Desk | Wed, Nov 28, 2018, 02:56 PM

కొలిక్కి రాని మహేష్ సుకుమార్ సినిమా

భరత్ అనే నేను తర్వాత వెంటనే వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా మొదలుపెట్టిన మహేష్ ఆ సినిమా తర్వాత సినిమా మీద క్లారిటీ ఇవ్వట్లేదు. అసలైతే మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో సుకుమార్ డైరక్షన్ లో మహేష్ 26వ సినిమా ఉంటుందని అంటున్నారు. అయితే ఈ సినిమా కథ విషయంలో ఇద్దరు ఒక నిర్ణయానికి రావట్లేదని తెలుస్తుంది. సుక్కు చెప్పిన పిరియాడికల్ మూవీని మహేష్ రిజెక్ట్ చేశాడని తెలుస్తుంది.

ఇక మరోపక్క అర్జున్ రెడ్డి డైరక్టర్ సందీప్ వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. ఆల్రెడీ కథ చెప్పడం ఓకే చేయడం అంతా జరిగింది. ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా షుగర్ ఫ్యాక్టరీ అని పెట్టనున్నారట. ఒకవేళ సుకుమార్ స్టోరీ ఓకే అవకుంటే ముందు మహేష్ సందీప్ వంగ డైరక్షన్ లోనే సినిమా చేస్తాడని టాక్.

మహేష్ తో సుకుమార్ ఆల్రెడీ 1 నేనొక్కడినే సినిమా చేశారు. అయితే హై టెక్నికల్ వాల్యూస్ తో వచ్చిన ఆ సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో విఫలమైంది. ఇద్దరు రెండోసారి కలిసి చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Untitled Document
Advertisements