కేటిఆర్ కు నాగ్ అశ్విన్ ట్వీట్..!

     Written by : smtv Desk | Wed, Nov 28, 2018, 02:59 PM

మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల వైఖరికి మండిపడ్డారు. ఆదివారం యాక్సిడెంట్ అయిన తన స్నేహితుడు దగ్గరలో ఉన్న గాంధి హాస్పిటల్ కు వెళ్లాడని అయితే అక్కడ డాక్టర్స్ ఎవరు లేకపోవడం వల్ల తన స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడని. దాదాపు రెండు గంటల పాటు గాంధి హాస్పిటల్ లో స్ట్రెచర్ మీద ప్రాణాలతో కొట్టుమిట్టాడి చివరి ప్రాణాలు కోల్పోయాడని నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు.

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఓ ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందక మనిషి చనిపోవడం దారుణమని.. అదే టైంలో వేరే హాస్పిటల్ కు తరలిస్తే బ్రతికేవాడని.. గవర్నమెంట్ హాస్పిటల్స్ చావుకి, నిర్లక్ష్యానికి పర్యాయపదాఉలు కాదని చెప్పడానికి ఏం చేయమంటారని కే.టి.ఆర్ సార్ అంటూ ట్వీట్ చేశారు. ఎవరిని అడగాలో తెలియడం లేదని నాగ్ అశ్విన్ ఎమోషనల్ అయ్యారు. మరి ఈ విషయం పట్ల కేటిఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Untitled Document
Advertisements