సోనాక్షి సిన్హా పై చీటింగ్ కేసు

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 01:05 PM

సోనాక్షి సిన్హా  పై చీటింగ్ కేసు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సిని వారసురాలు సోనాక్షి సిన్హా మీద చీటింగ్ కేసు పెట్టారు ఓ ఈవెంట్ నిర్వాహకులు. నిన్న మొన్నటిదాకా స్టార్ హీరోయిన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సోనాక్షి ఈమధ్య బాగా వెనుకపడ్డదని చెప్పాలి. సినిమా అవకాశాలు రాకున్నా తనకున్న స్టార్ క్రేజ్ తో ఈవెంట్స్, అవార్డ్ ఫంక్షన్స్ కు అటెండ్ అవుతుంది. అయితే ఈవెంట్స్ ద్వారా అమ్మడికి బాగానే ముట్టచెబుతున్నారట.

ఈమధ్య ఢిల్లీలో ఫ్యాషన్ ఇండియా అండ్ బ్యూటీ అవార్డ్స్ నిర్వహించారు. సెప్టెంబర్ 30న జరిగిన ఈ అవార్డ్ ఫంక్షన్ లో ఎంటర్టైన్ చేసేందుకు గాను సోనాక్షి సిన్హా 2.8 లక్షల రెమ్యునరేషన్ తీసుకుందట. అయితే అనుకున్న మొత్తాన్ని ముందే చెల్లించిన నిర్వాహకులకు ఈవెంట్ కు అటెండ్ అవ్వకుండా హ్యాండ్ ఇచ్చిందట సోనాక్షి సిన్హా. ఉదయం 10 గంటలకు రావాల్సిన ఫ్లైట్ మిస్ అవడంతో.. మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేస్తే అది కూడా మిస్ చేసిందట.

ఈవెంట్ కు సోనాక్షి వస్తుందని భావించిన ప్రేక్షకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అంతేకాదు సోనాక్షి రాదని తెలిసి కార్యక్రమం మధ్యలోనే ప్రేక్షకులు వెళ్లిపోయారట. ఇలా సోనాక్షి ఏడుగురిని మోసం చేశారంటూ ఆమెపై కేసు వేయడం జరిగింది. సినిమా ఆఫర్లు లేక ఇబ్బందులు పడుతున్న సోనాక్షికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారేలా ఉంది.

Untitled Document
Advertisements