టాక్సీవాలా యూనిట్ కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 03:35 PM

దాసరి నారాయణరావు తర్వాత సిని పెద్దగా పరిశ్రమ బాగోగులను చూసుకుంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. అభిరుచి కలిగిన సినిమా.. అది చిన్నదైనా పెద్దదైనా మంచి ఫలితాన్ని అందుకుంటే ఆ చిత్రయూనిట్ ను చిరంజీవి ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. చిరు గ్రీటింగ్స్ కొన్ని సినిమాలకు మరింత బలాన్ని ఇస్తున్నాయి. లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమా యూనిట్ కు చిరంజీవి అభినందనలు తెలియచేశారు.

సినిమా గురించి లేటుగా స్పందించినా సరే పైరసీ కోరల నుండి విడుదలైన సినిమా విజయం సాధించడం గొప్ప విషయమని.. దర్శకుడు పనితనం మెచ్చుకున్నారు చిరంజీవి. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వచ్చిన టాక్సీవాలా సినిమాను యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్-2 కలిసి నిర్మించారు. చిరుని కలిసేందుకు టాక్సీవాలా దర్శక నిర్మాతలతో పాటుగా హీరోయిన్ ప్రియాంకా జవల్కర్ కూడా ఉన్నారు.





Untitled Document
Advertisements