అవకాశం వస్తే తప్పకుండా చేస్తా :రష్మిక మందన్న

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 06:09 PM

 అవకాశం వస్తే తప్పకుండా చేస్తా :రష్మిక మందన్న

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కిర్రాక్ పార్టీ చిత్రం తో ఓవర్ నైట్ స్టార్ గా మారింది . ఈమె తెలుగులో ఛలో , గీతా గోవిందం వంటి విజయవంతమయిన సినిమాలు అందుకుని తెలుగులో కుడా మాంచి క్రేజ్ సంపాదించుకుంది . ఇటీవల విడుదలయిన నాగార్జున, నానిలు కలిసి చేసిన దేవదాస్ సినిమాలో కూడా నటించి మెప్పించింది . రష్మిక ప్రస్తుతం మరొకసారి విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రెడ్ చిత్రం లో నటిస్తుంది .

అది అలా ఉంటే తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్, డైరెక్టర్ అట్లీ ల హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న చిత్రం లో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి.
దాని తో రష్మిక కోలీవుడ్ ఎంట్రీపై తమిళ తంబీలు సంబరపడ్డారు, కాని రష్మిక ఆ సినిమాలో నటించడం లేదని తెలుస్తుంది. ఈ విషయం తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్వయంగా తానే వెల్లడించింది , అంతే కాకుండా "తమిళ ప్రేక్షకులు నా మీద చూపిస్తున్న ప్రేమకు సంతోషం.. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అవకాశం వస్తే తప్పకుండా చేస్తా " అంటూ ట్వీట్ చేసింది .

Untitled Document
Advertisements