విక్రమ్ కొత్త లుక్ మాములుగా లేదు

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 06:23 PM

విక్రమ్ కొత్త లుక్ మాములుగా లేదు

మన భారతీయ సినిమా ప్రపంచంలో విలక్షణనమైన సినిమాలకు నటులకి కొదవులేదు
కానీ నటులేందరున్నా నేను ప్రత్యేకం అని తన సినిమాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రేక్షక లోకానికి తెలియచెప్తాడు "చియాన్ విక్రమ్". సినిమా లోని సహజత్వం కోసం తన ఆరోగ్యం కూడా లెక్కచేయ్యడు ,ఆ సంగతి "ఐ" సినిమా లోని కురూపి పాత్ర ద్వారా మనకి తెలిసింది .

"Kadaram Kondan" ద్వారా సరిగ్గా అలాంటి పంధాలోనే మనముందుకు మళ్ళీ వస్తున్నాదానిపిస్తుంది .ఇటీవల విడుదలయిన సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని చూస్తుంటే ఇది మరొక ప్రయోగం లాగే ఉంది.
విలక్షణ నటుడు "కమల్ హాసన్ " సమర్పణ లో "విశ్వరూపం" "ఉత్తమ విల్లన్ " లాంటి విభిన్న చిత్రాల దర్శకుడు "రాజేష్ ఎం సెల్వ " దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షెడ్యూల్ తాజా గా మలేషియా కి మారిందని సమాచారం .

ఈ సినిమా తెలుగు అర్ధం "అతను దశను తీసుకున్నాడు" , చూద్దాం ఏ దశ తీసుకుంటాడో .

Untitled Document
Advertisements