సర్కార్ వివాదం మరీ వేడ్డెకింది

     Written by : smtv Desk | Thu, Nov 29, 2018, 06:37 PM

సర్కార్ వివాదం మరీ వేడ్డెకింది

చెన్నై, నవంబర్ 29:
ఇటీవల విడుదలై 250 కోట్లకి పైగా రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టిన సినిమా సర్కార్ . డైరెక్టర్ మురుగదాస్ ,హీరో విజయ్ ల కంబినేషన్ లో వచ్చిన మరొక సంచలన విజయం . విజయం సంగతి అటుంచితే ఈ సినిమా ఇంకా వివాదాల చుటూనే తిరుగుతోంది .

అస్సలు విషయం ఏంటంటే ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు ప్రభుత్వ పథకాలను కించపరుస్తూ దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠకు భంగపరిచే లా ఉన్నాయని కొంతమంది ప్రముఖులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు . అందుకే మురుగదాస్ టీం కొన్ని సన్నివేశాలు తొలగించారు . అంతటితో విషయం సర్దుమణగలేదు , మురుగదాస్ బహిరంగ క్షమాపణ చెప్పవలసిందేననీ,ఇక పై ప్రభుత్వ విధానాలను కించపరుస్తూ సినిమాలు తియ్యబోనని హామీ పత్రం రాసి మరీ ఇవ్వాలని పట్టుబట్టారట . ఈ విషయం పై స్పందిచిన మురుగదాస్ లాయర్ , చర్చించిన తరువాత నిర్ణయానికి వస్తామని తెలిపారు.

అయితే తాజాగా మురుగదాస్ స్పందిస్తూ .. నేను క్షమాపణ చెప్పను .. హామీ కూడా ఇవ్వను అని తేల్చిచెప్పాడు.
ఈ వివాదం ముదిరి ఎక్కడికి దారితీస్తుందో ??

Untitled Document
Advertisements