పాక్ అదుపులో ఉత్తరాంధ్ర జాలర్లు..

     Written by : smtv Desk | Fri, Nov 30, 2018, 10:29 AM

పాక్ అదుపులో ఉత్తరాంధ్ర జాలర్లు..

పాకిస్తాన్ తీర రక్షక దళం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తొమ్మిది మంది జాలర్లను అదుపులోకి తీసుకుంది. చేపల వేట కోసం వారు గుజరాత్ సరిహద్దు దాటి పొరుగు దేశ జలాల్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. వీరిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన నలుగురు, విజయనగరం జిల్లా పూసపాటిరేగలోని తిప్పలవలసకు చెందిన ఐదుగురు ఉన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పలువురు జాలర్లు ఉపాధి కోసం గుజరాత్ వెళ్లి అక్కడే నివసిస్తున్నారు. చేపట వేటలో భాగంగా వీరు సరిహద్దులు దాటేస్తున్నా.
ఏపీ జాలర్లను పాక్ పట్టుకున్న ఈ విషయంపై స్పందించిన మంత్రి కళా వెంకట్రావు ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు. వెంటనే స్పందించిన చంద్రబాబు వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండాలని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలని అధికారులకు ఆదేశించారు. వారి గురించి ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రెసిడెంట్‌ కమిషనర్‌తో మాట్లాడారు. పాక్‌ అదుపులో ఉన్న మత్స్యకారులను తిరిగి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు పాక్‌ అధికారులను సంప్రదిస్తున్నారు. వారిని వీలైనంత త్వరగా వెనకకు తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడతామని చంద్రబాబు అన్నారు.





Untitled Document
Advertisements