50000 మంది రైతుల భారీ నిరసన

     Written by : smtv Desk | Fri, Nov 30, 2018, 01:52 PM

50000 మంది రైతుల భారీ నిరసన

న్యూ ఢిల్లీ 30-11-2018 :
మాకు రామ మందిరం వద్దూ .. పంటకి మద్దతు ధరలు కావలి ,రైతు రుణమాఫీ కావలి " మోడీ " అంటూ పదంకలిపి , పాదం కదిపి పయనమయిన రైతులు . వివరాల లో కి వెళితే ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా 24 రాష్ట్రాల నుండి, 207 రైతు సంఘాలూ , పలు రాజకీయ పార్టీలూ "ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ " పతాకంపై ఆశిష్ మిట్టల్ నేతృత్వంలో సుమారు 50,000 మంది మద్దతుదారులతో పార్లమెంట్ స్ట్రీట్ కి శుక్రవారం "కిసాన్ ముక్తి మార్చ్" గా పయనమయ్యారు .కేంద్ర ప్రభుత్వం నుండి తగిన పరిహారం పొందడంలో విఫలమై ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులు పెద్ద స్థాయి లో నిరసనలో పాల్గొంటున్నారు .ముందుగా నిన్నటి సాయంత్రం రాంలీలా మైదానంలో సమావేశమై విధివిధానాలు చర్చించి ఈ రోజు యాత్ర గా బయలుదేరారు . సుమారు 3,500 మంది పోలీసులు బలగాలు వారిని అదుపు చేస్తున్నారు. "కిసాన్ ముక్తి మార్చ్" ఈ ఏడాది రైతుల నాలుగవ అతి పెద్ద నిరసన ఇది . లెఫ్ట్ పార్టీలు , ఆమ్ ఆద్మీ పార్టీ ముందు నుండి తమ మద్దతు తెలుపగా తాజా గా " రాహుల్ గాంధీ నేను అక్కడికి వచ్చి కలుస్తానని " ట్వీట్ చేసి తన మద్దతు తెలిపారు .
పాలక పక్షం నుండి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాకపోవడం శోచనీయం.

Untitled Document
Advertisements