ఆర్ ఆర్ ఆర్ లో ఆమే నటిస్తుందట

     Written by : smtv Desk | Fri, Nov 30, 2018, 04:50 PM

ఆర్ ఆర్ ఆర్ లో ఆమే నటిస్తుందట

హైదరాబాద్ నవంబర్ 30: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం "RRR" . ఈ మద్య నే లాంచనంగా మొదలయి గత పది రోజులుగా ఈ చిత్ర మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్లో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ పార్ట్ ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకు సంబందించిన మిగతా నటి నటులెవరు అనేది మాత్రం బయటకు రాకుండా రహస్యం గా ఉంచారు . దీంతో రకరకాల పేర్లు బయట చక్కర్లు కొడుతున్నాయి. ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో హీరోయిన్ గా నటించిన ప్రియమణి "ఆర్ఆర్ఆర్" లో కీలక పాత్ర చేస్తున్నట్టు వార్త సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది చిత్ర బృందం వెల్లడించే వరకు చెప్పలేం. ఇక ప్రియమణి విషయానికొస్తే ప్రస్తుతం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం గా ఉంది. అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టడంతో ఆమె అసలు సినిమాల వైపు చూడడం లేదు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ లో ఆమె నటించడం నిజమో పుకారో అర్ధం కావడంలేదు . ముందు ముందు ఇలాంటి వార్తలు ఇంకెన్నింటామో ??

Untitled Document
Advertisements