టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఎమ్మెల్యే జంప్

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 10:25 AM

టీడీపీకి భారీ షాక్.. జనసేనలోకి ఎమ్మెల్యే జంప్

తెలంగాణ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రాలో భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి, పత్తిపాడు ఎమ్మెల్యే రావెల కిశోర్‌‌బాబు టీడీపీకి గుడ్ బై చెప్పేశాడు. రాజీనామా లేఖను అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి పంపాడు. తాను టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు ఆయన మరో లేఖను టీడీపీ కార్యాలయంలో సమర్పిచాడు.

రావెల రేపు విజయవాడలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో రనున్నాడు. అంతకుముందు.. నాగార్జున యూనివర్శిటి నుంచి అనుచరులతో ర్యాలీగా వెళ్తాడు. కొన్నాళ్లుగా టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రావెల.. ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో పలుమార్లు సమావేశమై చర్చలు జరిపాడు. జనసేన టికెట్ కోసమే ఆయన పార్టీలో చేరినట్లు భావిస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన రావెల కిశోర్‌కు ఏపీ కేబినెట్‌‌లో చోటు దక్కింది.

Untitled Document
Advertisements