తన అందం తో మురిపిస్తున్న కాజల్ భామ

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 11:20 AM

తన అందం తో మురిపిస్తున్న కాజల్ భామ

హైదరాబాద్, డిసెంబర్ 01: విదేశీ లొకేషన్లలో దిగిన హాట్ పిక్స్ ను టాలీవుడ్ భామ కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టాగ్రమ్ ద్వారా షేర్ చేస్తోంది. ఇలా తన అభిమానులను పలకరిస్తోంది ఈ భామ. వయసు మీద పడుతున్నా.. తనలో గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదని కాజల్ నిరూపించుకుంటోంది. ఇదే సమయంలో భారీ సినిమాల్లో అవకాశాలను ఈ మార్వాడీ భామ అందిపుచ్చుకుంటోంది.

కవచం సినిమాలో నటిస్తున్న కాజల్.. తమిళ ప్రముఖ హీరో జయం రవి సరసన ఒక సినిమాలో నటిస్తోంది. ఆపై శంకర్ దర్శకత్వంలో నటించే ఛాన్స్ కాజల్ కు దక్కిందని వార్తలు వస్తున్నాయి. భారతీయుడు రెండో పార్టులో కాజల్ ఒక హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో అధికారిక ప్రకటనలు రావాల్సి ఉన్నాయి.

View this post on Instagram

#VitaminSea

A post shared by Kajal Aggarwal (@kajalaggarwalofficial) on

Untitled Document
Advertisements