రజిని 'పెట్ట' ఫాన్స్ కోసం ఫస్ట్ సింగిల్ రాబోతుంది

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 03:45 PM

రజిని 'పెట్ట' ఫాన్స్ కోసం ఫస్ట్  సింగిల్ రాబోతుంది

చెన్నై డిసెంబర్ 1; తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కి ఇటు తెలుగు లో అటు తమిళం లో చాల మంచి క్రేజ్ ఉంది
విభిన్నమైన కథ కథనాలను ఆధ్యంతం ఆసక్తికరంగా తెరకెక్కిoచడం ఆయన ప్రత్యేకత. ఈ డైరెక్టర్ తన కొత్త చిత్రం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి "పెట్ట" అనే చిత్రం తీస్తున్నారు. సంగీత దర్శకుడిగా యువ సంచలనం అనిరుద్ రవిచంద్రన్ ని తీసుకున్నారు.

అనిరుద్ ఈ సినిమాలో సూపర్ స్టార్ ఎంట్రీ సీన్ కోసం ఒక మంచి మాస్ బీట్ తో కూడిన సాంగ్ ను రెడీ చేసేరట దానిని సోమవారం సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్టు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఫస్ట్ సింగిల్ తో చిత్రం పైన ఆసక్తి పెంచేలా ప్లాన్ చేసారు .

ఈ సినిమాలో రజిని సరసన సిమ్రాన్ నటించగా, త్రిష , విజయ్ సేతుపతి , నవజ్జుద్ధీన్ సిద్ధిఖీ నటిస్తున్నారు. సన్ పిక్చెర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సంక్రాంతి కానుకగా తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు





Untitled Document
Advertisements