మెగాస్టార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్..!

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 06:11 PM

మెగాస్టార్ ప్రాజెక్ట్ క్యాన్సిల్..!

హైదరాబాద్, డిసెంబర్ 01: ఖైది నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా సినిమా సెట్స్ మీద ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చిరు కొరటాల శివ డైరక్షన్ లో మూవీ చేస్తాడని అనుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్ లోనే ఈ సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఎందుకో ఏమో కాని ఈ సినిమా క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట.

భరత్ అనే నేను తర్వాత కొరటాల శివ చిరుతోనే సినిమా చేస్తాడని అన్నారు. కాని సైరా నరసింహా రెడ్డి అనుకున్న టైంకు ఇంకా లేట్ అవడం వల్ల కొరటాల శివ చిరు సినిమా బదులు మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడట. మహేష్ మహర్షి సినిమా చేస్తుండగా ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమా చేయాల్సి ఉండగా స్క్రిప్ట్ ఫైనల్ కాకపొవడం వల్ల కొరటాల శివతో సినిమా చేస్తాడని అంటున్నారు. శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత మహేష్, కొరటాల శివ చేస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

Untitled Document
Advertisements