పవన్ ఫాన్స్ ని రెచ్చ గొట్టిన 'ఆపరేషన్ 2019'

     Written by : smtv Desk | Mon, Dec 03, 2018, 12:11 PM

పవన్ ఫాన్స్ ని రెచ్చ గొట్టిన 'ఆపరేషన్ 2019'

హైదరాబాద్ డిసెంబర్ 3 : టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ నటించిన " ఆపరేషన్ దుర్యోధన " సినిమా మనకు తెలిసిందే , ఆ సినిమా 2005 లో విడుదలయి పొలిటికల్ సెటైర్ గా నిలిచి మంచి విజయం సాధించింది . మరొక సారి శ్రీకాంత్ హీరోగా నటిస్తూ అదే తరహాలో వచ్చినదే " ఆపరేషన్ 2019 " . తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఈ సమయం లో ఇలాంటి సినిమా రావడం చెప్పుకోదగిన విషయమే .

కాగా ఈ సినిమాలో వచ్చే డైలాగ్ లో పవన్ కళ్యాణ్ ని విమర్శించారంటూ పెద్ద రచ్చవుతుంది. వివలారోల్లోకెళితే ‘మాసిపోయిన గడ్డంతో తిరిగితే ఓట్లు రాలవు’ అన్న డైలాగ్‌ను పవన్‌కు ఆపాదిస్తూ ప్రచారం జరుగుతుంది . దీనిని దర్శకుడు బాబ్జీ ఖండిస్తూ , ఆ డైలాగ్ ఏ సందర్భం లో వచ్చిందో చూసి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికాడు.

ఈ సినిమాను దర్శకుడిగా ఫీలై తీయలేదని, బాధ్యతగల పౌరుడిగా తీశానని బాబ్జీ స్పష్టం చేశాడు. దేశ భవిష్యత్ ఓటరు చేతిలో ఉందని యువత చేతిలో కాదని చెప్పడమే తన ఉద్దేశమన్నాడు. ఈ సినిమాను పవన్‌తో తీసి ఉంటే బాగుండేదని అంటున్నారని, ఇప్పుడున్న పరిస్థితిలో ఆయన తనకు డేట్స్ ఇస్తారా? అని ప్రశ్నించాడు.చెప్పిన విషయాన్నీ ,మాట్లాడే మాటలను , వక్రీకరించకూడదని బాబ్జీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని బాబ్జీ పేర్కొన్నాడు.

Untitled Document
Advertisements