తెలంగాణలో డబ్బులు పంచనున్నచంద్రబాబు : విజయసాయిరెడ్డి

     Written by : smtv Desk | Mon, Dec 03, 2018, 05:19 PM

 తెలంగాణలో డబ్బులు పంచనున్నచంద్రబాబు : విజయసాయిరెడ్డి

అమరావతి,డిసెంబర్ 3 : వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆంధ్రాలో వర్షాల గురించి మాట్లాడుతూ ఇక్కడ ఋతుపవనాలు ముఖం చాటేయడంతో కరువు ఏర్పడింది అన్నారు. రైతులు కరువుతో అల్లాడుతుంటే వీరిని పట్టించుకొనే తీరికలేని బాబు ఏపిలో దోచుకున్న డబ్బును తెలంగాణాలో పంచేపనిలో నిమగ్నమై ఉన్నారు అని అన్నారు. చంద్రబాబు చీటింగ్ కళకు అబ్బురపడిపోయిన రాహుల్ గాంధీ తెలంగాణ ఎన్నికల మేనేజ్మెంట్ మొత్తాన్ని ఆయనకి అప్పగించారు అని ఎద్దేవా చేసారు.

చంద్రబాబు ఏపిలో దోచుకున్న డబ్బుతో తెలంగాణలో నంద్యాల మోడల్ ను ప్రవేశపెట్టే పనిలో ఉన్నారు అని ఎద్దవా చేసారు. చంద్రబాబు ఆర్ట్ అఫ్ లివింగ్ కు ఆదిగురువు అని ,అబద్దాలు చెప్పడం లో ఉన్న స్కిల్స్ చూసి రాహుల్ కు దిమ్మతిరిగిపోయిందన్నారు. ప్రాంతాలు ,కులాలు ,మతాలవారీగా ఓట్లను ఎలా కొని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొచ్చో నాయుడు బాబు రాహుల్ బాబాకి ఉపదేశించారు అని మండిపడ్డారు.

Untitled Document
Advertisements