బిగ్ షాపింగ్ డేస్ సేల్: ఫ్లిప్‌కార్ట్

     Written by : smtv Desk | Mon, Dec 03, 2018, 06:28 PM

బిగ్ షాపింగ్ డేస్ సేల్: ఫ్లిప్‌కార్ట్

బిగ్ షాపింగ్ డేస్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ మరోమారు భారీ ఆఫర్లకు తెరలేపింది. ఈ నెల 6 నుంచి 8 వరకు మూడు రోజులపాటు మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. రెడ్‌మీ నోట్ 6 ప్రో, గూగుల్‌ పిక్సెల్‌ 2 ఎక్స్‌ఎల్‌, ఆసుస్‌ జెన్‌ఫోన్‌ లైట్‌ ఎల్‌1, పోకో ఎఫ్‌1, రిలయ్‌మి సీ1 స్మార్ట్‌ఫోన్లతో పాటు పలు కంపెనీల ఫోన్లపై భారీ డిస్కౌంట్ లభించనుంది.

పొకో ఎఫ్ 1, గూగుల్ పిక్సెల్ 2, రియల్‌మీ సి1, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ 1, ఆనర్ 9 ఎన్, రెడ్‌మీ నోట్ 6 ప్రొ, నోకియా 5.1, ఇన్ఫినిక్స్ నోట్ 5 వంటి స్మార్ట్‌ఫోన్లపై కనీవినీ ఆఫర్లు ప్రకటించింది. అలాగే టీవీలు, గృహోపకరణాలపై 70 శాతం, ల్యాప్‌టాప్‌లు, కెమెరా, ఆడియో యాక్సెసరీలు ఇతర వాటిపై 80 శాతం, ఫ్యాషన్, హోం ఫర్నిచర్‌పై 40 నుంచి 80 శాతం, బ్యూటీ, టాయ్స్, స్పోర్ట్స్ బుక్స్ తదితర వాటిపై 80 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

Untitled Document
Advertisements