హిందీ టెంపర్ వచ్చేసింది

     Written by : smtv Desk | Mon, Dec 03, 2018, 07:35 PM

హిందీ టెంపర్ వచ్చేసింది

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలుగు చిత్ర సీమలో గొప్ప నటుల వరుసలో ఈ తరం హీరోల్లో జూనియర్ యన్.టి.ఆర్ ముందు ఉంటాడనడంలో ఎలాంటి సందేహం లేదు . వరసపెట్టి ఎన్ని అపజయాలు ఎదురయినా చెక్కు చెదరని క్రేజ్ అతనిది . జూనియర్ యన్.టి.ఆర్ నటన గురించీ , పోషించిన పాత్రలు గురించి వర్ణించడానికి ఏ పదం వాడినా సరిపడదని గొప్పగొప్ప నటులే కీర్తించారు. వొక దర్శకుడు త్రిపాత్రా అభినయం కోసం జూనియర్ యన్.టి.ఆర్ ని ఎన్నుకున్నాడంటే మనం అర్ధం చేసుకోవచ్చు అతని స్టామినా ఏంటో . ఇప్పటి వరకు ద్విపాత్ర అభినయంలో 3 సినిమాల సహా పలు విభిన్నమయినా, సాహసోపేతమయిన పాత్రలు చేసాడు . ఆ పాత్రలలో "టెంపర్" సినిమా లో చేసిన "దయా " పాత్ర వొకటి . ఆ సినిమాని సెన్సషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించారు . ఆ సినిమా టైటిల్ కి తగ్గట్టు గా తన నటనలోని టెంపర్ ని చూపించాడు యన్.టి.ఆర్ .

కాగా ఈ సినిమాని హిందీ లో రీమేక్ చేస్తున్నారు . మొదటిగా వేరే హిందీ హీరో హ్రితిక్ రోషన్ తో పూరి తానే స్వయంగా చేద్దామనుకున్నానని అయితే హ్రితిక్ జూనియర్ యన్.టి.ఆర్ ని మించి చెయ్యలేనాన్నడని వొక ఇంటర్వ్యూ వెల్లడించారు . అయితే ఇప్పుడు హిత్ శెట్టి దర్శకత్వంలో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్న చిత్రం " సింబ్బా". సారా అలీఖాన్ కధానాయికగా నటించగా కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసారు . హిందీ జనాలకి బాగా నచ్చి సామజిక మాధ్యమాల్లో బాగా హడావిడి చేస్తున్నారు .
ఇక ట్రైలర్ విషయానికొస్తే మన తెలుగు సినిమాలో ఉన్న కీలక సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చూడొచ్చు . మొత్తం మీద పర్వాలేదు అన్నట్లుంది .

Untitled Document
Advertisements