400 కోట్లు..@ 2.ఓ

     Written by : smtv Desk | Tue, Dec 04, 2018, 11:03 AM

400 కోట్లు..@ 2.ఓ

హైదరాబాద్, డిసెంబర్ 04: శంకర్, రజిని కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వచ్చిన 2.ఓ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. నవంబర్ 29న రిలీజైన ఈ సినిమా కలక్షన్స్ విషయంలో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఫైనల్ గా నిర్మాణ సంస్థ నుండి 2.ఓ అఫిషియల్ కలక్షన్స్ రిపోర్ట్ వచ్చింది. 4 రోజుల్లో 2.ఓ 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియాలో 210 కోట్ల నెట్ రాగా ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది.

యూఏఈ, జపాన్, ఆస్ట్రేలియా అన్ని ఏరియాల్లో కలిపి 400 కోట్ల గ్రాస్ అన్నమాట. చెన్నైలో 4 రోజుల్లో 10 కోట్లు రాబట్టిన 2.ఓ. కేరళలో 6 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు వసూళు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 13.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది 2.ఓ. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మూవీని 72 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో 35 కోట్ల కలక్షన్స్ రాగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 40 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. పరిస్థితి చూస్తే అంత వసూళు చేయడం కష్టమే అన్నట్టు ఉంది.

Untitled Document
Advertisements