క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్ క్రికెటర్

     Written by : smtv Desk | Wed, Dec 05, 2018, 11:52 AM

క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన   స్టార్ క్రికెటర్

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 05: భారత క్రికెట్‌లో విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న గౌతం గంభీర్‌ క్రికెట్ ఆటకు గుడ్‌బై చెప్పాడు. తాను అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్‌ అవుతున్నట్లు అతను మంగళవారం ప్రకటించాడు. ఈ నెల 6 నుంచి సొంత మైదానం ఫిరోజ్‌షా కోట్లాలో ఆంధ్ర జట్టుతో జరిగే రంజీ మ్యాచ్‌లో తాను ఆఖరి సారిగా బరిలోకి దిగుతానని 37 ఏళ్ల గంభీర్‌ వెల్లడించాడు. 2003లో ఏప్రిల్‌లో తొలిసారి భారత జట్టు తరఫున ఆడిన గంభీర్‌... 2016 నవంబర్‌లో రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌పై తన ఆఖరి టెస్టు మ్యాచ్‌ ఆడాడు. అతని టి20 కెరీర్‌ 2012లో, వన్డే కెరీర్‌ 2013లోనే ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేలకు పైగా పరుగులు చేసిన గంభీర్‌ తన వీడ్కోలుపై... ‘రిటైర్మెంట్‌ గురించి ఎన్నో రోజులుగా ఆలోచిస్తున్నాను.

Untitled Document
Advertisements