జయ గెటప్‌లో నిత్య మీనన్

     Written by : smtv Desk | Wed, Dec 05, 2018, 03:16 PM

జయ గెటప్‌లో నిత్య మీనన్

హైదరాబాద్, డిసెంబర్ 05: దేశంలో బయోపిక్‌ల హవా వీస్తోంది. పురుచ్చితలైవి, దివంగత సీఎం జయలలిత బయోపిక్‌ రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ‘ది ఐరన్‌ లేడీ’ పేరుతో వస్తున్న ఈ చిత్రానికి ప్రియదర్శిని దర్శకత్వం వహిస్తున్నారు.

చిత్రంలో జయ ఫస్ట్‌లుక్‌ను జయలలిత వర్ధంతి సందర్భంగా విడుదల చేశారు. జయ కట్టుబొట్టులో నిత్యా మీనన్ ఆకర్షిస్తోంది. మేకప్ కళాకారులు నైపుణ్యంతో నిత్యను జయలోకి పరకాయ ప్రవేశం చేయించారని అభిమానులు అంటున్నారు. అయితే నిత్య జయగా సరిగ్గా ఒదిగిపోలేదని, మరికాస్త వెడల్పు ముఖం ఉన్న నటిని ఎంచుకుని ఉంటే బాగుండేదని మరికొందరు అంటున్నారు. జయ గెటప్‌లో నిత్య మీనన్ అంటూ రెండు నెలల కిందట కూడా ఒక ఫొటో వైరల్ అయింది. ఫస్ట్ లుక్’తో పోలిస్తే అందులో నిత్య బాగా ఒదిగిపోయారని అంటున్నారు. జయ జీవితంపై కోలీవుడ్‌లో మరో రెండు సినిమాలు కూడా తెరకెక్కుతున్నాయి.

Untitled Document
Advertisements