జూపూడి ప్రభాకర్‌రావు నివాసం వద్ద హైడ్రామా

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 10:20 AM

 జూపూడి ప్రభాకర్‌రావు నివాసం వద్ద హైడ్రామా

హైదరాబాద్‌, డిసెంబర్ 6: తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగిసిన సందర్భంగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదులుపుతున్నాయి.ఇందులో భాగంగా ఏపీ ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ జూపూడి ప్రభాక ర్‌రావు నివాసం వద్ద బుధవారం రాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. ఓ ఇన్నోవా కారులో ముగ్గురు వ్యక్తులు కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని జూపూడి నివాసానికి చేరుకున్నారు. దీంతో అక్కడే ఉన్న తెరాస శ్రేణులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన జూపూడి నివాసానికి చేరుకోవడంతో ఆ ముగ్గురు 3 బ్యాగులతో జూపూడి నివాసం వెనుక గోడ దూకి పారిపోయే ప్రయత్నం చేశారు.

అక్కడే తెరాస కార్యకర్తలు వెంబడించి ఒకరిని పట్టుకోగా, ఇద్దరు పారిపోయారు. దొరికిన వ్యక్తి వద్ద ఉన్న రూ.17.50 లక్షలను పోలీసులకు అప్పగించారు. పారిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల వద్ద భారీ ఎత్తున నగదు ఉందంటూ తెరాస కార్యకర్తలు జూపూడి నివాసం ఎదుట ధర్నాకు దిగారు. ఓటర్లకు డబ్బు పంచేందుకే డబ్బు తెచ్చారంటూ తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ విషయమై పోలీసులు జూపూడిని వివరణ అడగ్గా తనకు ఆ యువకులతో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.

Untitled Document
Advertisements