పలుచోట్ల నగదు పట్టివేత....!

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 12:05 PM

పలుచోట్ల నగదు పట్టివేత....!

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎన్నికలకు ఇంకా వొక్కరోజే వుండటంతో రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీలు ముమ్మరంచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు చెక్‌పోస్టు వద్ద చేసిన తనిఖీల్లో ఆటోలో తరలిస్తున్న రూ.13.4 లక్షల నగదును పట్టుకున్నారు. నల్లగొండ జిల్లా కనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చేపట్టిన సోదాల్లో బైక్‌పై తరలిస్తున్న రూ. 1.28 లక్షలు నగదును పోలీసులు పట్టుకున్నారు. నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా ఖమ్మం ద్వారకానగర్‌లోని ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టగా రూ. 8.22 లక్షల నగదుని గుర్తించారు. ఆ నగదుని స్వాధీనం చేసుకొని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసారు.

Untitled Document
Advertisements