300 కోట్లతో విక్రమ్ 'మహావీర్ కర్ణ'

     Written by : smtv Desk | Thu, Dec 06, 2018, 02:52 PM

300 కోట్లతో విక్రమ్ 'మహావీర్ కర్ణ'

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రం హీరోగా ఆర్.ఎస్ విమల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మహావీర్ కర్ణ. యునైటెడ్ ఫిల్మ్ కింగ్డం బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారట. ఈ సినిమాకు టైటిల్ గా మహావీర్ కర్ణ అని పెట్టారు. కర్ణుడి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. తిరువునంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూట్ కు వెళ్తుంది.

ఈ కార్యక్రమంలో హీరో విక్రం పాల్గొనలేదు. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్ సినిమాలకు బాగా క్రేజ్ వచ్చింది. సరైన సబ్జెక్ట్ తో వస్తే ఎలాంటి సంచలనాలైనా సృష్టించవచ్చని ప్రూవ్ చేశాడు రాజమౌళి. ఈమధ్యనే 600 కోట్ల బడ్జెట్ తో వచ్చిన 2.ఓ కూడా మంచి ఫలితాన్ని అందుకుంది. అందుకే విక్రం మహావీర్ కర్ణ మీద అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుంది.. ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుంది అన్నది సినిమా వస్తేనే కాని చెప్పగలం.

Untitled Document
Advertisements