ఎన్టీఆర్ సెట్ లో బాలకృష్ణ తనయుడు కి ఏం పని..?

     Written by : smtv Desk | Sat, Dec 08, 2018, 02:45 PM

 ఎన్టీఆర్ సెట్ లో బాలకృష్ణ తనయుడు కి  ఏం పని..?

హైదరాబాద్, డిసెంబర్ 08: నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో నటిస్తున్నాడా అంటే కొందరు అవునని.. మరికొందరు కాదని అంటున్నారు. బాలకృష్ణ యంగ్ ఏజ్ రోల్ లో మోక్షజ్ఞ కనిపించనున్నాడని అంటున్నారు. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ మోక్షజ్ఞ ఎన్.టి.ఆర్ మూవీ సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు. ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో ఎన్.టి.ఆర్ బయోపిక్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో బాలకృష్ణ దాదాపు 60 గెటప్పులలో కనిపించనున్నాడు.

క్రిష్ డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీలో మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ రాలేదు. అయితే ఒకవేళ మోక్షజ్ఞ ఎన్.టి.ఆర్ బయోపిక్ లో ఉన్నా ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచేలా ప్లాన్ చేస్తున్నారు. తనయుడు డెబ్యూ మూవీకి ఎన్.టి.ఆర్ బయోపిక్ పర్ఫెక్ట్ అనుకుంటున్నాడు బాలకృష్ణ. ఇక ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లోనే మోక్షజ్ఞ మూవీ ఉంటుందని తెలుస్తుంది.





Untitled Document
Advertisements